Tuesday, June 29, 2010
ఒక అబ్బాయ్ లవ్ స్టొరీ.
ఒక అబ్బాయ్ లవ్ స్టొరీ ఇది .తను బి.టెక్ చదువుతున్నాడు .నైత్ క్లాసులో లవ్ చేసి టెన్త్ లో ప్రపోస్ చేసాడు .కొన్నాలు హ్యాపీగా వున్నారు.టెన్త్ ఐన తరువాత రోజు కాల్ చేసేది .సడెన్ గా వారం తరువాత మానేసింది . ఒక రోజు ఈవెనింగ్ స్కూల్ కు వెళ్ళాడు .అప్పుడు వాళ క్లాసుమేట తో వస్తూ కనిపించింది .రెండు రోజులు తరువాత తెలిసింది వాడిని ప్రేమిస్తుంది అని షాక్ అయ్యాడు .ఆరు నెలలు తరువాత కాల్ చేసి "ఐ యాం వేరి సారీ "అంటే అంత మర్చిపోయి సరే అన్నాడు .అలా ఆ ఆమ్మాయ్ సెవెన్ మెంబర్స్ ను మార్చింది .మల్లి లాస్ట్ కి వీడే కావాలి అంటుంది .రీసెంటుగా వాళ ఫ్రెండ్ తో కాల్ చేయించి ఇక నుంచి నేను ఎ తప్పు చేయను అని చెప్పించింది .మరల తను ఆ అమ్మాయ్ మాటలకూ చాలా సార్లు కరిగి పోయాడు .ఆ అమ్మాయ్ ది ప్రేమా ,మోసమా మీరే చెప్పండి .
Friday, June 25, 2010
Thursday, June 24, 2010
ప్రేమ అంటే కాలక్షేపమా ......
ఒక అమ్మాయ్ ను ఆ అబ్బాయ్ ౩ సంవత్సరాలుగా ప్రేముస్తున్నాడు .ఆ అమ్మాయ్ కూడా ప్రేమిస్తున్నాను అన్నది .వారి ప్రేమ సినిమాలకు షికార్లు అన్ని అందరి ప్రేమలాగే ఉన్నాయు .ఇలా సాగుతున్న ప్రేమలో ఆ అమ్మాయ్ ఒక విషయం చెప్పింది.తన ఇంటి దగ్గర అబ్బాయ్ తనను ఇబ్బంది పెడుతున్నాడు అని ,అప్పుడు ఈ అబ్బాయ్ తన ఇంటి దగ్గర అబ్బాయ్ కు వార్నింగ్ ఇచ్చాడు .కొన్ని రోజులు తరువాత ఆ అమ్మాయ్ ఈ అబ్బాయ్ తో మాట్లాడ డం తగ్గిచ్చింది .ఎందువలనా అంటే ఏవో కారణాలు చెప్పింది .కొన్నిరోజులు తరువాత ఆ అమ్మాయ్ తన ఇంటి దగ్గర అబ్బాయ్ తో కనిపించింది . ఆ విషయం అడిగితే ఆ అబ్బాయ్ మంచి వాడు అన్నది .మరికొన్ని రోజులు తరువాత నేను ఆ అబ్బాయ్ ను ప్రేమిస్తున్నాను అనిచెప్పి నీవు నాకు కాల్ చేయవద్దు అని చెప్పి వెళ్లి పోయింది .ఈ విధంగా అబ్బాయ్ మోసపోయాడు .ఆమ్మాయ్ లు ఒక విషయం నిజంగా ప్రేమిస్తే ప్రేమించాము అని చెప్పండి .ఆ ప్రేమ జీవితాంతం ఒకరి పైనే వుంచండి అంతే కానీ కొన్ని రోజులు ఒకరిని మరికొన్ని రోజులు మరి ఒకరిని ప్రేమించడం అంటే అది ప్రేమే కాదు .డబ్బు కోసమో ఇంకా వెటి కోసమో అని ప్రేమించే వారిని మోసం చేయవద్దు .ప్రేమిస్తే జీవితాతం వారి తోనే వుండండి లేకపోతే ప్రేమిచ్చే వద్దు .అమ్మాయ్ ఐన అబ్బాయ్ ఐన . ప్రేమ అంటే కాలక్షేపము కోసం కాదు అది చాలా విలువైనది .ఫ్రెండ్స్ ఒక విషయం మీ జీవితంలో లేక మీ ఫ్రెండ్ జీవితంలో ప్రేమలో గెలిచినా ఓడిన జరిగిన విషయాలను షేరు చేసుకోండి అదే విదంగా మీ విలువైన సలహాలను పంప్పించండి .
Wednesday, June 23, 2010
Monday, June 21, 2010
Sunday, June 20, 2010
అబ్బాయ్ చేతిలో అమ్మాయ్
ఒక అమ్మాయ్ జీవితంలో జరిగిన సంఘటన .అబ్బాయ్ ప్రేమించాను అన్నాడు మొదట అమ్మాయ్ ఒప్పుకోలేదు .తరు వాత నువ్వే ప్రాణం నువ్వులేకపోతే చచ్చిపోత అన్నాడు .ఆ అమ్మాయ్ ఆ మాటలను నమ్మింది .ప్రేమించింది ప్రాణంగా ఆ అబ్బాయే సర్వసం అనుకుంది .పెళ్లి చేసుకున్ట్ట నన్నాడు .నమ్మింది తనకు వచ్చిన సంబంధాలను విడిచిపెట్టింది .ఆ అబ్బాయ్ కొన్నాలు ఆ అమ్మాయ్ తో తిరిగి తరువాత నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు .మా ఇంటి దగ్గర నీ గురించి చెప్ప్తే వద్దు అన్నారు .నీవు వేరే పెళ్లి చేసుకో అని సలహా ఇచ్చాడు .ఆ అమ్మాయ్ మోసపోయానన భాదను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోబోయింది.చివరకు ఏదో విదంగా భ్రతికింది .వేరే పెళ్లి చేసుకుంది .కాని ఇక్కడ అమ్మాయ్ మోసపోయండి .అందుకే అబ్బాయులు ఐనా అమ్మాయులు ఐనా ప్రేమిస్తే ప్రేమించే టప్పుదే పెళ్ళిచేసుకోవడానికి ధైర్యం వుంటే ప్రేమను కొనసాగించండి .జీవితాతం ఉండగలము కలిసి వుంటాము ఎన్ని కష్టాలు వచ్చిన అనుకుంటే ఉండగలరు .ప్రేమను ఇచ్చే వారినే మోసం చేయడం ఎందుకు ప్లీజ్ దయవుంచి ఒకరిని ఒకరు మోసం చేసుకో వద్దు
కాలక్షేపం ప్రేమలు వద్దు .ప్రేమ అనేది చాల విలువ ఐనది.
కాలక్షేపం ప్రేమలు వద్దు .ప్రేమ అనేది చాల విలువ ఐనది.
ఇది అమ్మాయ్ మోసం చేయడం కాదా .......
ఇది నా ఫ్రెండ్ జీవితంలో జరిగిన యదార్ధ గాధ .తన పేరు రాజు చదువు కుంటున్నాడు . వయస్సు 24 తన రూం దగ్గర
ఓ అమ్మాయ్ వున్నది . ఆ ఆమ్మాయ్ ఇంటర్ వరకు చదివి తరువాత వేరే దేశంలో జాబు చేసి ఆరోగ్యం భాగోలేక ఇంటికి వచ్చేసింది.ఆ అమ్మాయ్ వయస్సు 28తనకు అమ్మయు గురుంచి అసలు తెలియదు .ఆ అమ్మాయ్ ని అప్పుడప్పుడు చూడడమే కానీ ఎప్పుడు మాట్లాడలేదు .జనవరి ఫస్ట్ నైట్ ఆ అమ్మాయ్ ఇంటిదగ్గర కేకు కట్ చేసారు . అప్పడు అమ్మాయే వచ్చి కేకు వాడికి ఇచ్చింది.అదే ఆ అమ్మాయ్ మొదటిసారి దగ్గరగా వచ్చి మాట్లాడడము .తరువాత రోజు ఉదయం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పింది .తరువాత కొన్నిరోజులు వాడు బయటకు velli వచ్చాడు .తరువాత అమ్మాయ్ ఒకరోజు జాబు కోసం ట్రై చేస్తున్నాను అనిచెప్పింది బయట కనిపిచ్చ్చి నప్పుడు .అప్పుడు ఫోన్ నెంబరు ఇచ్చి నీకు తెలిస్తే చెప్పు అంది .తరువాత ఫోన్ లో మాట్లాడం మొదలు పెట్టారు .అమ్మాయ్ కు వాలా వారు జాబు చూసారు .అప్పడి నుంచి ఆ అమ్మాయ్ తనను కలవడం మొదలు పెట్టింది .ఆ అమ్మయ్యే ఒకరోజు బయటకు తీసుకెళ్ళమంది .అదిమొదలు డైలీ కలుసు కునేవారు .తరువాత జాబు నెలరోజులు చేసి ఆరోగ్యం బాగోలేదు అని జాబు కు సెలవు పెట్టింది .తరువాత మరల జాబు కు వెళ్ళు తున్న అని ఇంటి దగ్గర చెప్పి తనతో వచ్చేసేది .ఇలా కొన్నాలు తనతో పార్కులకు తిరిగేది .తనతో నువ్వే నాప్రాణం అని నువ్వు ప్రతి రోజు కనిపించ్చాలి అని నువ్వు నాతో జీవితాతం వుండాలని ఎన్నో చెప్పేది .ఇలా మూడు నెలలు గడిచాయ్ ఇంకా ఎన్నో చెప్పింది .తరువాత నుంచి ఫోన్ మాట్లాడడం తగ్గించింది .ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే వీలు కావట్లేదు అని అంది .ప్రేతి రోజు SMS పంపించేది.ప్రేతి మెస్సేజ్ లోను నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని పంపించేది . తరువాత మరో జాబ్లో జాయిన్ ఐనది.తరు వాత నుంచి నాకు వీలుకుదరడం లేదు అని చెప్పింది .ఆ జాబ్లో జాయన్ ఐన వారము తరువాత ఒకరోజు కలిసింది .ఆ రోజు చెప్పెందిఅట వారములో ఒకరోజు ఐన సెలవు పెట్టి నీతో వస్తాను అని తరువాత రోజు నుంచి
తనతో మాట్లాడాము కట్ చేసింది .ఫోన్ చేస్తే కట్ చేస్తుంది .ఇంటి దగ్గర ప్రాబ్లం అని అనుకుంటే అల కూడాలేదు .ఎందువల్ల నాతో మాట్లాడకుటున్నావ్ అని అడిగిన తను సమాదానం చెప్పడం లేదు .ముందురోజు అన్ని చెప్పి తరువాత రోజు నుంచి తను అల మారడం చాలా భాదగా అనిపించింది .తను ఆఫీసు వెళ్ళే దారిలో తను వెళ్ళాడు అప్పుడు తను అన్నాడు నీవు నాతో మాట్లాడక పోతే చచ్చి పోతాను అని అన్నాడు .తను మాత్రం ఏమి మాట్లాడ కుండా బస్సు ఎక్కి వేల్లిపోయునది .తను వెళ్ళాడు తన ఆఫీసుకు కూడా వెళ్ళాడు కానీ తను ఇతరుల తో చక్కగా మాట్లాడుకుంటుంది .బస్లో వున్నపుడు కూడా వీడు ఫోన్ చేస్తే కట్ చేసేది ఎవరో ఫోన్ చేస్తే మాట్లాడేది .అప్పడి నుంచి మా ఫ్రెండ్ వారం రోజుల వరకు ఫోన్ ట్రై చేసిన మాట్లాడింది కాదు .తన ముందే వుండేది తను మాత్రం హ్యాపీగా వుండేది మా ఫ్రెండ్ మాత్రం ఆ రోజు నుంచి తిండి ,నిద్ర ,చదువు అన్ని మానేసి భాదపడుతూ వున్నాడు .తనను ఎందుకు మోసం చేసింది అని ఇప్పడికి ఏడుస్తున్నాడు .ఇది జరిగి రెండు నెలలు అవునది .తను ఇంకా భాధ పడుతూనే వున్నాడు కానీ ఆ అమ్మాయ్ ఇప్పుడు చాలా హ్యాపీగా తనముందు తిరుగు తుంది .నా ఫ్రెండ్ మాత్రం తనను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు అ విషయం కూడా అమ్మయకు చెప్పాడు .హలో ఫ్రెండ్స్ మీరే నా స్నేహితుడికి సలహా ఇవ్వండి

Friday, June 18, 2010
Tuesday, June 15, 2010
అమ్మాయ్ మోసం చేసింది (సూర్య పేపర్ నుంచి )
ప్రాణం తీసిన ప్రేమోన్మాదం
‘రెండక్షరాల ప్రేమ యువతలో చిచ్చురేపుతుంది.. ప్రేయసి కాదన్నదని ఒకరు..ప్రియుడు పెళ్లికి ఒప్పుకోలేదని మరొకరు నిండు ప్రాణాలను బలి తీసుకోవడం నిత్యకృత్యంగా మారుతోంది.. యువతీ,యువకులు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చి తిరిగిరాని లోకాలకు మరలిపోతున్నారు. తమ కళ్ల ముందే అశువులు బాసిన కన్నబిడ్డల తీపిగుర్తులను జీవితాంతం కడుపులోనే దాచుకుని తల్లిదండ్రులు జీవితాలు వెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొంటోంది. తాజాగా భాగ్యనగరంలో జరిగిన ఈ సంఘటనే అందుకు ఉదాహరణ. తన ప్రేమను నిరాకరించిందన్న కారణంగా ప్రియురాలిని భవనంపైనుంచి తోసి తానూ ఆత్మహత్య చేసుకున్న ఓ యువకుడి ప్రేమోన్మాద గాథను మీరూ చదవండి ..’ యధార్థంగా జరిగిన ఘటన సూర్య పాఠకుల కోసం...
నగరం నడిబొడ్డున ప్రేమోన్మాది చేతిలో ఓ యువతి బలైంది. ప్రియురాలిని బహుళ అంతస్తుల భవనంనుంచి తోసేసి తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలో కలకలం రేపింది. పంజగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న సంఘటన సంచలనం సృష్టించింది. వివరాల్లోకెళితే... నేపాల్ దేశానికి చెందిన శ్రీదేవి (19) తన సోదరి ఉమతోపాటు పంజగుట్టలోని ఉప్పర్‌బస్తీలో నివాసముండేవారు. అదే బస్తీలో ఆమె ఇంటి సమీపంలో వినోద్ (24) తన కుటుంబసభ్యులతో కలిసి నివాసముండేవారు. శ్రీదేవి బేగంపేటలోని లైఫ్‌స్టైల్‌లో సేల్స్‌గర్ల్‌గా పనిచేసేది. వినోద్ కూడా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న సమయంలో పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరి పరిచయం పెరిగి ప్రేమగా మారింది. మూడేళ్ళుగా ఇంట్లో వారికి తెలియకుండా వీరు ప్రేమించుకుంటున్న సంగతి ఇద్దరి ఇళ్లలో తెలియడంతో గొడవలు జరిగాయి. కాగా వినోద్ ప్రేమ విషయం తన ఇంట్లో చెప్పడంతో పెళ్ళికి పెద్దలు నిరాకరించారు. దీంతో శ్రీదేవి కుటుంబం రహమత్‌నగర్‌కు మారింది. వినోద్ కుటుంబం జగద్గిరిగుట్టలోని శ్రీనివాస్‌నగర్‌కు నివాసాన్ని మార్చుకున్నారు.
కుటుంబ సభ్యులు మందలించినా శ్రీదేవి, వినోద్‌లు రహస్యంగా కలుసుకుంటుండేవారు. గత మూడు నెలల నుంచి శ్రీదేవి ప్రియుడు వినోద్‌ను కలవకుండా, ఫోన్‌చేస్తున్నా లిఫ్ట్ చేయకుండా ముఖం చాటేస్తుండటంతో వినోద్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఎలాగైనా శ్రీదేవిని కలవాలని నిశ్చయించుకొని మూడురోజుల క్రితం వినోద్ ఫోన్‌చేయడంతో కాల్ రిసీవ్ చేసుకున్న శ్రీదేవి తాను సంతోష్ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నానని, మళ్లీ తనకు ఫోన్ చేయొద్దని ఫోన్ పెట్టేసింది. తనను శ్రీదేవి మోసం చేసిందని గ్రహించిన వినోద్ ఉన్మాదిగా మారి ఎలాగైనా ఆమెను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఆదివారం ఉదయం శ్రీదేవి ఫోన్‌కు కాల్‌చేసి లైఫ్‌స్టైల్ వద్దకు రావాలని సమాచారం ఇచ్చాడు. అక్కడికి చేరుకున్న శ్రీదేవిని మాటలతో లైఫ్‌స్టైల్ బిల్డింగ్ పై అంతస్తుకు తీసుకెళ్ళి ప్రేమతో మాట్లాడుతూ శ్రీదేవిని ఒక్కసారిగా పై నుంచి కిందకు తోసేసి, తను రాసుకున్న సుసైడ్‌నోట్‌ను జేబులో పెట్టుకుని కిందకు దూకాడు. తీవ్ర గాయాలైన శ్రీదేవిని జుబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది.
కిందపడిన వినోద్ అక్కడికక్కడే మృతిచెందాడు. శ్రీదేవిని అంతమొందించేందుకు నిర్ణయించుకున్న వినోద్ తన వెంట పదునైన కత్తిని కూడా తెచ్చుకున్నాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కత్తిని స్వాధీనం చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
మరణవాంగ్మూలం:
నమ్మించి మోసం చేసిందనే బాధతో శ్రీదేవిని చంపడానికి ఆత్మహత్యచేసుకోవడానికి నిర్ణయించుకున్నట్లు సుసైడ్ నోట్‌లో వినోద్ పేర్కొన్నాడు. ‘అమ్మా , నాన్నా క్షమించండి...మీరు ప్రేమను పంచారు కానీ నేను మీకు ఏంచేయలేదు... అక్కా, తమ్ముడు, అమ్మానాన్నను జాగ్రత్తగా చూసుకోండి.. వచ్చే జన్మలోనైనా మీ కొడుకుగా పుట్టి రుణం తీర్చుకుంటా. శ్రీదేవి లాంటి మోసగత్తెకు మరణం కరెక్టు అని...అందుకే చంపానంటూ వినోద్ సూసైడ్ నోట్‌లో ఇంగ్లీష్‌లో రాయడం కొసమెరుపు.
ప్రేమలో మోసం సూర్య పేపెర్ నుంచి
ఛాటింగ్.. చీటింగ్ (క్రైం స్టోరీ)
ఉదయం ఉద్యోగానికి వెళ్ళి సాయంత్రం భర్త ఇంటికి వచ్చేవరకు కంప్యూటర్‌లో ఛాటింగ్ చేయడం ప్రారంభించింది. ఈ సమయంలో మరో యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇంటర్నెట్ ఛాటింగ్ ద్వారా ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒంటరిగా ఉండటంతో ఛాటింగ్ ద్వారా పరిచయం అయిన యువకుడిని ఇంటికి పిలిపించుకుంది. చుట్టుపక్కల వారికి అనుమానం రాకుండా తన సోదరుడిగా పరిచయం చేసింది. కొంతకాలం ఈ చాటుమాటు వ్యవహారం కొనసాగింది. అయితే ఈ విషయం భర్తకు తెలియడంతో ఇలాంటి పద్ధతులకు స్వస్తి పలకాలని హెచ్చరించడం ప్రారంభించాడు. దీంతో ప్రియుడిని కోల్పోతానని భావించింది.
అతడితో పాటు పధకం వేసింది. తనను ప్రేమించిన యువకుడు స్వయంగా భర్తను అంతమొందిస్తే అడ్డు తొలగిపోతుందని, తాను ప్రేమించిన యువకుడిని పెళ్ళి చేసుకోవచ్చని ఇద్దరూ ప్లాన్‌వేశారు. ఇందులో భాగంగా ఈ నెల12వ తేదీన రాత్రి ఇంటికి వచ్చిన భర్తకు మజా కూల్‌డ్రింక్‌లో స్లీపింగ్‌పిల్స్ వేసి ఇచ్చింది. దీంతో మత్తులోకి జారిన తర్వాత ప్రియుడితో కలిసి భర్త మెడకు ఉరివేసి హతమార్చింది. ఆపై తనకేమీ తెలియదన్నట్లు తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే నిజం నిప్పులాంటింది...ఎప్పటికీ ఎవరూ తప్పించుకోలేరని టప్పాచబుత్ర పోలీసులు నిజం చేశారు. అక్టోబర్ 19న అసలు విషయం వెలుగుచూసింది. దీంతో పోలీసులు కట్టుకున్న ఇల్లాలే ప్రియుడి కోసం కడతేర్చిందని స్పష్టం చేశారు. యధార్థ ఘటన సూర్య పాఠకుల కోసం....
ఈ క్రమంలో ెపెళ్ళి అయిన కొన్ని రోజు ల తర్వాత అనూష మెదక్ జిల్లా ప్రాంతానికి చెందిన సిరిసిల్ల నవీన్ కుమార్ నగరంలోని బోలక్‌పూర్ సికింద్రాబాద్‌లో ఉంటూ డీగ్రీ చదువుకుంటున్న యువ కునితో ప్రేమాయణం మొదలుపెట్టింది. అయితే ఇంట ర్‌నెట్ ద్వారా పరిచయం అయిన నవీన్‌కుమార్ అనూష ఇద్దరూ కలుసుకుని తిరిగేవారు. భర్త ఎన్నో సార్లు భా ర్యను బుజ్జగించినప్పటకీ ఆమె పెడచెవినపెట్టింది. అయితే అ నూష నవీన్‌కుమార్‌ను పెళ్ళి చేసుకునేందుకు వారిరురికీ మధ్య భర్త అడ్డం ఉన్నాడని...ఎలాగైనా భర్తను చంపాలని పక్కావ్యూహం రూపొందించుకుంది.
ఈ విషయంలో నవీన్‌కుమార్‌ను సహాయం కోరింది. దీంతో ఇద్దరూ అనూష భర్త చంద్రశేఖర్‌ను చంపాలని గోన ెసంచితో పాటు తాళ్లు, ప్లాస్టర్‌లు కొనుగోలు చేశారు. కాగా సోమవారం రాత్రి చంద్రశేఖర్ కు మాజా పానీయంలో నిద్ర మాత్రలు వేసి అనుమానం రాకుండా ఇచ్చింది. భా ర్య సంతోషంగా మాజా బాటిల్ ఇచ్చిందని వెంటనే చంద్రశేఖర్ తా గేశాడు. ఆత ర్వాత మత్తులోని చేరుకుని నిద్ర పోయాడు. అప్పటికే పథకం వేసి పెట్టిన అనూష తన భర్త మత్తు ్తలోకి జారడంతో ప్రియు డున వీన్‌కుమార్‌కు ఫోన్ చేసి త్వరగా రావా లని కోరింది. హు టాహుటన ప్రియు రాలు పిలిచిందని ఇంటికి వెళ్లాడు.
మ త్తులో ఉన్న అనూష భర్త గోంతుకు తా డు వేసి బిగించి చంద్రశేఖర్‌ను హతమార్చారు. అనంతరం తాళ్ళతో కట్టి, గోనె సంచిలో పెట్టి దగ్గరిలోని మున్సిపల్ పార్కు వద్ద పడేశారు. తెల్ల వారు ఝూమున గోనెసంచిలో మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమా చారం అందించారు. రంగంలోకి దిగిన పో లీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేయగా, మృతుడు చంద్రశేఖర్ భార్య అనూష చెబుతున్న మాటలకు చేతలకు పొంతన లేకపోవడంతో తమదైన శైలిలో పోలీ సులు విచారించారు.
ఇందులో ప్రియుడు నవీన్‌కుమార్ సహా యంతో ఈ పని చేసినట్లు ఒప్పు కుందని డీసీపీ తెలిపారు. నిందితుల వద్ద ఉన్న ద్విచక్ర వాహనాన్ని, రెండు సెల్‌ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ ఎం. వెంకటేశ్వర్ రావు ఆధ్వర్యంలో హుమాయూన్‌నగర్ ఇన్‌స్పెక్టర్ ఎన్. చంద్ర శేఖర్, టాప్పాచబుత్రా ఇన్స్‌పెక్టర్ ఎస్. త్రిముర్తులు, యస్.ఐ. రామాంజనేయులు ఈ కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Monday, June 14, 2010
Subscribe to:
Posts (Atom)
i love my india
TIME
Get your own Digital Clock
Live Cricket Score
hiiii friends
Onliner's Location
MY MENU
-
▼
2010
(26)
-
▼
June
(16)
- ఒక అబ్బాయ్ లవ్ స్టొరీ.
- ఇది న్యాయమా ..........
- ప్రేమ అంటే కాలక్షేపమా ......
- చూడండి
- ప్రేమా కాదా ......
- అబ్బాయ్ చేతిలో అమ్మాయ్
- ఇది అమ్మాయ్ మోసం చేయడం కాదా .......
- ఆమె తీరు నాకు బాధ
- ప్రేమ మాటేసి.. మనసు కాటేసి
- అమ్మాయ్ మోసం చేసింది (సూర్య పేపర్ నుంచి )
- ప్రేమలో మోసం సూర్య పేపెర్ నుంచి
- మనసులో మాట ఈనాడు నుంచి
- మనసులో మాట ఈనాడు పేపర్ నుంచి
- No title
- No title
- మనసులో మాట
-
▼
June
(16)
Labels
- అచంపేట్ రాజ్ బ్లాగ్ నుంచి (1)
- ఈనాడు నుంచి (1)
- ఈనాడు నుంచి (2)
- మనసులో మాట ఈనాడు పేపర్ నుంచి (2)
- సాక్షి నుంచి (2)
About Me
- venky
- hii friends i am venky my pet name
My List
Followers
ఈ వెబ్ సైట్ ఎలా వుంది ?
Blog Archive
-
▼
2010
(26)
-
▼
June
(16)
- ఒక అబ్బాయ్ లవ్ స్టొరీ.
- ఇది న్యాయమా ..........
- ప్రేమ అంటే కాలక్షేపమా ......
- చూడండి
- ప్రేమా కాదా ......
- అబ్బాయ్ చేతిలో అమ్మాయ్
- ఇది అమ్మాయ్ మోసం చేయడం కాదా .......
- ఆమె తీరు నాకు బాధ
- ప్రేమ మాటేసి.. మనసు కాటేసి
- అమ్మాయ్ మోసం చేసింది (సూర్య పేపర్ నుంచి )
- ప్రేమలో మోసం సూర్య పేపెర్ నుంచి
- మనసులో మాట ఈనాడు నుంచి
- మనసులో మాట ఈనాడు పేపర్ నుంచి
- No title
- No title
- మనసులో మాట
-
▼
June
(16)
Pages
Powered by Blogger.