ఛాటింగ్.. చీటింగ్ (క్రైం స్టోరీ)
ఉదయం ఉద్యోగానికి వెళ్ళి సాయంత్రం భర్త ఇంటికి వచ్చేవరకు కంప్యూటర్‌లో ఛాటింగ్ చేయడం ప్రారంభించింది. ఈ సమయంలో మరో యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇంటర్నెట్ ఛాటింగ్ ద్వారా ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒంటరిగా ఉండటంతో ఛాటింగ్ ద్వారా పరిచయం అయిన యువకుడిని ఇంటికి పిలిపించుకుంది. చుట్టుపక్కల వారికి అనుమానం రాకుండా తన సోదరుడిగా పరిచయం చేసింది. కొంతకాలం ఈ చాటుమాటు వ్యవహారం కొనసాగింది. అయితే ఈ విషయం భర్తకు తెలియడంతో ఇలాంటి పద్ధతులకు స్వస్తి పలకాలని హెచ్చరించడం ప్రారంభించాడు. దీంతో ప్రియుడిని కోల్పోతానని భావించింది.
అతడితో పాటు పధకం వేసింది. తనను ప్రేమించిన యువకుడు స్వయంగా భర్తను అంతమొందిస్తే అడ్డు తొలగిపోతుందని, తాను ప్రేమించిన యువకుడిని పెళ్ళి చేసుకోవచ్చని ఇద్దరూ ప్లాన్‌వేశారు. ఇందులో భాగంగా ఈ నెల12వ తేదీన రాత్రి ఇంటికి వచ్చిన భర్తకు మజా కూల్‌డ్రింక్‌లో స్లీపింగ్‌పిల్స్ వేసి ఇచ్చింది. దీంతో మత్తులోకి జారిన తర్వాత ప్రియుడితో కలిసి భర్త మెడకు ఉరివేసి హతమార్చింది. ఆపై తనకేమీ తెలియదన్నట్లు తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే నిజం నిప్పులాంటింది...ఎప్పటికీ ఎవరూ తప్పించుకోలేరని టప్పాచబుత్ర పోలీసులు నిజం చేశారు. అక్టోబర్ 19న అసలు విషయం వెలుగుచూసింది. దీంతో పోలీసులు కట్టుకున్న ఇల్లాలే ప్రియుడి కోసం కడతేర్చిందని స్పష్టం చేశారు. యధార్థ ఘటన సూర్య పాఠకుల కోసం....
ఈ క్రమంలో ెపెళ్ళి అయిన కొన్ని రోజు ల తర్వాత అనూష మెదక్ జిల్లా ప్రాంతానికి చెందిన సిరిసిల్ల నవీన్ కుమార్ నగరంలోని బోలక్‌పూర్ సికింద్రాబాద్‌లో ఉంటూ డీగ్రీ చదువుకుంటున్న యువ కునితో ప్రేమాయణం మొదలుపెట్టింది. అయితే ఇంట ర్‌నెట్ ద్వారా పరిచయం అయిన నవీన్‌కుమార్ అనూష ఇద్దరూ కలుసుకుని తిరిగేవారు. భర్త ఎన్నో సార్లు భా ర్యను బుజ్జగించినప్పటకీ ఆమె పెడచెవినపెట్టింది. అయితే అ నూష నవీన్‌కుమార్‌ను పెళ్ళి చేసుకునేందుకు వారిరురికీ మధ్య భర్త అడ్డం ఉన్నాడని...ఎలాగైనా భర్తను చంపాలని పక్కావ్యూహం రూపొందించుకుంది.
ఈ విషయంలో నవీన్‌కుమార్‌ను సహాయం కోరింది. దీంతో ఇద్దరూ అనూష భర్త చంద్రశేఖర్‌ను చంపాలని గోన ెసంచితో పాటు తాళ్లు, ప్లాస్టర్‌లు కొనుగోలు చేశారు. కాగా సోమవారం రాత్రి చంద్రశేఖర్ కు మాజా పానీయంలో నిద్ర మాత్రలు వేసి అనుమానం రాకుండా ఇచ్చింది. భా ర్య సంతోషంగా మాజా బాటిల్ ఇచ్చిందని వెంటనే చంద్రశేఖర్ తా గేశాడు. ఆత ర్వాత మత్తులోని చేరుకుని నిద్ర పోయాడు. అప్పటికే పథకం వేసి పెట్టిన అనూష తన భర్త మత్తు ్తలోకి జారడంతో ప్రియు డున వీన్‌కుమార్‌కు ఫోన్ చేసి త్వరగా రావా లని కోరింది. హు టాహుటన ప్రియు రాలు పిలిచిందని ఇంటికి వెళ్లాడు.
మ త్తులో ఉన్న అనూష భర్త గోంతుకు తా డు వేసి బిగించి చంద్రశేఖర్‌ను హతమార్చారు. అనంతరం తాళ్ళతో కట్టి, గోనె సంచిలో పెట్టి దగ్గరిలోని మున్సిపల్ పార్కు వద్ద పడేశారు. తెల్ల వారు ఝూమున గోనెసంచిలో మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమా చారం అందించారు. రంగంలోకి దిగిన పో లీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేయగా, మృతుడు చంద్రశేఖర్ భార్య అనూష చెబుతున్న మాటలకు చేతలకు పొంతన లేకపోవడంతో తమదైన శైలిలో పోలీ సులు విచారించారు.
ఇందులో ప్రియుడు నవీన్‌కుమార్ సహా యంతో ఈ పని చేసినట్లు ఒప్పు కుందని డీసీపీ తెలిపారు. నిందితుల వద్ద ఉన్న ద్విచక్ర వాహనాన్ని, రెండు సెల్‌ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ ఎం. వెంకటేశ్వర్ రావు ఆధ్వర్యంలో హుమాయూన్‌నగర్ ఇన్‌స్పెక్టర్ ఎన్. చంద్ర శేఖర్, టాప్పాచబుత్రా ఇన్స్‌పెక్టర్ ఎస్. త్రిముర్తులు, యస్.ఐ. రామాంజనేయులు ఈ కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
0 వ్యాఖ్యలు:
Post a Comment