HII FRIENDS

Tuesday, June 15, 2010

అమ్మాయ్ మోసం చేసింది (సూర్య పేపర్ నుంచి )

ప్రాణం తీసిన ప్రేమోన్మాదం
sridevi1అనుబంధాలను పంచాల్సిన ప్రేమ... రక్తాక్షరాలను రాస్తోంది. అవునంటే... లేచిపోవడం కాదంటే... కత్తిపోట్లు, యాసిడ్‌ దాడులు. ఇలాంటి ప్రేమోన్మాదం ఇప్పుడు నిత్యకృత్యమైంది. తెలిసీతెలియని వయస్సులో ఆకర్షణకు లోనై... నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఎందరో యువతీయువకులు. ఫలితంగా కన్నవారికి కడుపుకోత మిగులుస్తున్నారు. భాగ్యనగరంలోని బేగంపేట లైఫ్‌స్టైల్‌ భవనం వద్ద ఏప్రిల్‌ 18న జరిగిన ఘటనే దీనికి నిదర్శనం. తాను తప్పుచేశానంటూనే మరో జన్మలో మీకే కొడుకుగా పుడతానని తన తల్లిదండ్రులకు లేఖ రాశాడా యువకుడు.

‘రెండక్షరాల ప్రేమ యువతలో చిచ్చురేపుతుంది.. ప్రేయసి కాదన్నదని ఒకరు..ప్రియుడు పెళ్లికి ఒప్పుకోలేదని మరొకరు నిండు ప్రాణాలను బలి తీసుకోవడం నిత్యకృత్యంగా మారుతోంది.. యువతీ,యువకులు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చి తిరిగిరాని లోకాలకు మరలిపోతున్నారు. తమ కళ్ల ముందే అశువులు బాసిన కన్నబిడ్డల తీపిగుర్తులను జీవితాంతం కడుపులోనే దాచుకుని తల్లిదండ్రులు జీవితాలు వెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొంటోంది. తాజాగా భాగ్యనగరంలో జరిగిన ఈ సంఘటనే అందుకు ఉదాహరణ. తన ప్రేమను నిరాకరించిందన్న కారణంగా ప్రియురాలిని భవనంపైనుంచి తోసి తానూ ఆత్మహత్య చేసుకున్న ఓ యువకుడి ప్రేమోన్మాద గాథను మీరూ చదవండి ..’ యధార్థంగా జరిగిన ఘటన సూర్య పాఠకుల కోసం...

నగరం నడిబొడ్డున ప్రేమోన్మాది చేతిలో ఓ యువతి బలైంది. ప్రియురాలిని బహుళ అంతస్తుల భవనంనుంచి తోసేసి తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలో కలకలం రేపింది. పంజగుట్ట పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న సంఘటన సంచలనం సృష్టించింది. వివరాల్లోకెళితే... నేపాల్‌ దేశానికి చెందిన శ్రీదేవి (19) తన సోదరి ఉమతోపాటు పంజగుట్టలోని ఉప్పర్‌బస్తీలో నివాసముండేవారు. అదే బస్తీలో ఆమె ఇంటి సమీపంలో వినోద్‌ (24) తన కుటుంబసభ్యులతో కలిసి నివాసముండేవారు. శ్రీదేవి బేగంపేటలోని లైఫ్‌స్టైల్‌లో సేల్స్‌గర్ల్‌గా పనిచేసేది. వినోద్‌ కూడా మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న సమయంలో పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరి పరిచయం పెరిగి ప్రేమగా మారింది. మూడేళ్ళుగా ఇంట్లో వారికి తెలియకుండా వీరు ప్రేమించుకుంటున్న సంగతి ఇద్దరి ఇళ్లలో తెలియడంతో గొడవలు జరిగాయి. కాగా వినోద్‌ ప్రేమ విషయం తన ఇంట్లో చెప్పడంతో పెళ్ళికి పెద్దలు నిరాకరించారు. దీంతో శ్రీదేవి కుటుంబం రహమత్‌నగర్‌కు మారింది. వినోద్‌ కుటుంబం జగద్గిరిగుట్టలోని శ్రీనివాస్‌నగర్‌కు నివాసాన్ని మార్చుకున్నారు.

కుటుంబ సభ్యులు మందలించినా శ్రీదేవి, వినోద్‌లు రహస్యంగా కలుసుకుంటుండేవారు. గత మూడు నెలల నుంచి శ్రీదేవి ప్రియుడు వినోద్‌ను కలవకుండా, ఫోన్‌చేస్తున్నా లిఫ్ట్‌ చేయకుండా ముఖం చాటేస్తుండటంతో వినోద్‌ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఎలాగైనా శ్రీదేవిని కలవాలని నిశ్చయించుకొని మూడురోజుల క్రితం వినోద్‌ ఫోన్‌చేయడంతో కాల్‌ రిసీవ్‌ చేసుకున్న శ్రీదేవి తాను సంతోష్‌ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నానని, మళ్లీ తనకు ఫోన్‌ చేయొద్దని ఫోన్‌ పెట్టేసింది. తనను శ్రీదేవి మోసం చేసిందని గ్రహించిన వినోద్‌ ఉన్మాదిగా మారి ఎలాగైనా ఆమెను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఆదివారం ఉదయం శ్రీదేవి ఫోన్‌కు కాల్‌చేసి లైఫ్‌స్టైల్‌ వద్దకు రావాలని సమాచారం ఇచ్చాడు. అక్కడికి చేరుకున్న శ్రీదేవిని మాటలతో లైఫ్‌స్టైల్‌ బిల్డింగ్‌ పై అంతస్తుకు తీసుకెళ్ళి ప్రేమతో మాట్లాడుతూ శ్రీదేవిని ఒక్కసారిగా పై నుంచి కిందకు తోసేసి, తను రాసుకున్న సుసైడ్‌నోట్‌ను జేబులో పెట్టుకుని కిందకు దూకాడు. తీవ్ర గాయాలైన శ్రీదేవిని జుబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది.

కిందపడిన వినోద్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. శ్రీదేవిని అంతమొందించేందుకు నిర్ణయించుకున్న వినోద్‌ తన వెంట పదునైన కత్తిని కూడా తెచ్చుకున్నాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కత్తిని స్వాధీనం చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

మరణవాంగ్మూలం:
నమ్మించి మోసం చేసిందనే బాధతో శ్రీదేవిని చంపడానికి ఆత్మహత్యచేసుకోవడానికి నిర్ణయించుకున్నట్లు సుసైడ్‌ నోట్‌లో వినోద్‌ పేర్కొన్నాడు. ‘అమ్మా , నాన్నా క్షమించండి...మీరు ప్రేమను పంచారు కానీ నేను మీకు ఏంచేయలేదు... అక్కా, తమ్ముడు, అమ్మానాన్నను జాగ్రత్తగా చూసుకోండి.. వచ్చే జన్మలోనైనా మీ కొడుకుగా పుట్టి రుణం తీర్చుకుంటా. శ్రీదేవి లాంటి మోసగత్తెకు మరణం కరెక్టు అని...అందుకే చంపానంటూ వినోద్‌ సూసైడ్‌ నోట్‌లో ఇంగ్లీష్‌లో రాయడం కొసమెరుపు.

0 వ్యాఖ్యలు:

Post a Comment

THANK U

i love my india